AP: ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రతినిధులతో వైఎస్ జగన్ నేడు సమావేశమయ్యారు. కార్యకర్తల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'కార్యకర్తల విషయంలో ఇంతవరకూ ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూస్తాం. మనం కూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది. జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటాం. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి. వారిని చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడతాను' అని అన్నారు.