సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మీ టైం ఆన్ మై మెట్రో’ క్యాంపెన్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ వేడుకలలో హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొని మాట్లాడారు. నేటి నుంచి (8,9,10) మూడు రోజుల పాటు ‘మీ టైం ఆన్ మై మెట్రో’ క్యాంపెన్ పేరిట కోఠి, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.