దేశ సరిహద్దులోని టిబెట్‌ను భారీ భూకంపం వణికించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లోనే కనీసం 20సార్లు భూప్రకంపనలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ముందుగా మంగళవారం ఉదయం 6:30 గంటలకు 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత రిక్టరు స్కేలుపై 4 తీవ్రతతో పలుమార్లు భూమి కంపించింది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం.. 126 మంది ప్రాణాలు కోల్పోయారు. 400 మంది గాయపడ్డారు.