AP: రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ అంశంపై త్వరలోనే అఖిలపక్షంతో వెళ్లి సీఎం చంద్రబాబును కలుస్తామని కీలక ప్రకటన చేశారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఇదే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.