కడప నగరంలోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గురువారం ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి ఫరుఖ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన మంత్రి ఫరుఖ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ కవాతు, శకటాల ప్రదర్శన నిర్వహించారు. కలెక్టర్ శివశంకర్, ఎస్పీ విష్ణువర్ధన్ రాజు, ఎమ్మెల్యే మాధవీ, తదితరులు పాల్గొన్నారు.