శ్రీశైలం జలాశయం అనుబంధంగా పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం జలాశయం వరద నీరును నంద్యాల సమీపంలో కుందూ నదిలోకి వదలడంతో అక్కడ నుంచి వల్లూరు మండలం ఆదినిమాయపల్లి ఆనకట్ట వద్ద పెన్నా నదిలో చేరుతున్నది. ఆదినిమాయపల్లి ఆనకట్ట ద్వారా చెన్నూరు మీదుగా ప్రవహిస్తూ సోమశిల జలాశయంలోకి వరద నీరు పరుగులు పెడుతున్నది. ప్రస్తుతం పెన్నా నదిలో 10వేల 520 క్యూషకులు వరద నీరు ప్రవహిస్తున్నది.