మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీసిన గొప్ప నేతగా, సమర్థవంతమైన ప్రధానిగా దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయారని కడప జిల్లా టిడిపి మైనారిటీ అధ్యక్షుడు ఖాదర్ బాషా అన్నారు. శుక్రవారం కమలాపురంలో ఖాదర్ బాషా మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ దేశాభివృద్ధి పట్ల ఆయన చూపించిన కృతనిష్ఠ ప్రతి భారతీయుడికి ఆదర్శప్రాయంగా ఉందన్నారు.