రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ రూ. 3580 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం కడప కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు గడిచినా కూడా ఇంతవరకు విద్యార్థులకు న్యాయం చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.