చక్రాయపేట - రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లక్షా పై చిలుకు మెజార్టీతో పాటు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి 4 లక్షల మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చక్రాయపేట జడ్పీటీసీ శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం చక్రాయపేట మండలంలోని యర్రగుడి, హరిజనవాడలో గడప గడపకు కార్యక్రమాన్ని జడ్పీటీసీ శివ ప్రసాద్ రెడ్డి నిర్వహించారు.