శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా పులివెందుల అమ్మవారి శాలలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవిని గాజులతో ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు అలంకరించారు. ఆలయ పండితులు లలితా సహస్ర పారాయణం, కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పట్టణంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు.