ఖపరస్తాన్‌ను పరిశుభ్రం చేయించిన మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అనిత

79చూసినవారు
ఖపరస్తాన్‌ను పరిశుభ్రం చేయించిన మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అనిత
కోదాడ : ముస్లీం రంజాన్‌ను పురష్కరించుకుని కోదాడలోని ఖపరస్తాన్‌ను కోదాడ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వంటిపులి అనితనాగరాజు, కమీషనర్‌ కందుల అమరేందర్‌రెడ్డిలు పరిశుభ్రం చేయించారు. ఈ సందర్భముగా చైర్‌పర్సన్‌ అనిత మాట్లాడుతూ ముస్లీం పవిత్ర రంజాన్‌ పండుగ దగ్గరకు వస్తున్నందున వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఖపరస్తాన్‌ను పరిశుభ్రం చేయిస్తున్నట్లు తెలిపారు. రంజాన్‌ మాస మొత్తం ముస్లీంలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మునిసిపల్‌ సిబ్బంది వారికి మొత్తం అందుబాటులో ఉండి పారిశుధ్యాన్ని నివారించేందుకు ఇతరత్రా అవసరాల తీర్చేందుకు సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. మసీదుల పరిసర ప్రాంతాలలో ఎటువంటి మౌలిక సదుపాయాలు అవసరమైన యుద్దప్రాతిపథికన ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నయీమ్‌, ఖాజాగౌడ్‌, శ్రీను, వేలాద్రి, గురుమూర్తి, శానిటరి ఇన్స్‌పెక్టర్‌ దండు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్