న్యూస్ బులెటిన్ జూన్ 19: హుజునగర్ లో అక్రమ వెంచర్లు, నేరేడుచర్ల లో గుట్కా రాకెట్ మరిన్ని ముఖ్యాంశాలు

205చూసినవారు
అక్రమార్కులపై కొరడా!

వెంచర్ల ఏర్పాటులో నిబంధనలను తుంగలో తొక్కిన నిర్వహకులపై అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. హుజూర్‌నగర్‌ పట్టణంలో కొంత కాలంగా ఏర్పాటు చేసిన వెంచర్లు కనీసం నిబంధనలను పాటించలేదని అధికారుల విచారణలో గుర్తించారు. హుజూర్‌నగర్‌ పురపాలక సంఘం పరిధిలో మొత్తం 14 అక్రమ వెంచర్లు ఉన్నట్లు కోదాడ ఆర్డీవో గుర్తించారు.

పేట పోలీసులపై డీజీపీకి ఫిర్యాదు చేస్తాం: సంకినేని

ప్రజలు దరఖాస్తులు ఇచ్చినా సూర్యాపేట ఎస్పీ, డీఎస్పీ, పట్టణ సీఐ పట్టించుకోవడం లేదని, మంత్రి అనుచరులకు వత్తాసు పలుకుతున్నారని, న్యాయాన్ని రక్షించడం లేదని , భాజపా రాష్ట్రశాఖ తరఫున డీజీపీకి ఫిర్యాదు చేస్తామని రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు.

రూ.8 లక్షల విలువైన గుట్కాలు స్వాధీనం

చిన్న ఆధారంతో రూ.8 లక్షల విలువైన నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు వీటిని అక్రమంగా విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు సూర్యాపేట జిల్లా కోదాడ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మిట్టపల్లి గోవింద్‌, చేర్విరాల విజయ్‌కుమార్‌, కొడితాల నారాయణ మరియు మురారిశెట్టి హరీష్‌ ఉన్నారని పేర్కొన్నారు.

నీటి కుంటలో పడి యువకుడు మృతి

పెద్దకుమార్తె వివాహం కోసం సోమవారం నిశ్చయ తాంబులాలు స్వీకరించే కార్యక్రమం సిద్ధం చేశారు. అంతకుముందు కుమారుడు మహ్మద్‌ కరీం అదే గ్రామానికి చెందిన తన స్నేహితులు జహీర్‌, సైదులతో కలిసి స్నానం చేయడానికి గ్రామ సమీపంలో ఉన్న బతుకమ్మ బండ పక్కనే కుంట వద్దకు వెళ్లారు. మట్టి పనుల కోసం గుంతను లోతుగా తవ్వి వదిలేశారు. లోతు తెలియక తొలుత కరీం కుంటలో దిగి మునిగిపోతుండడంతో స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్