కోనసీమలో మత్స్యకారుల వలకు చిక్కిన 1000 కిలోల టేకు చేప.. జేసీబీతో ఒడ్డుకు చేర్చారు

1505చూసినవారు
కోనసీమలో మత్స్యకారుల వలకు చిక్కిన 1000 కిలోల టేకు చేప.. జేసీబీతో ఒడ్డుకు చేర్చారు
కోనసీమ జిల్లా అంతర్వేదిలో మత్స్యకారుల వలకు సుమారు 1000 కిలోల బరువున్న టేకు చేప చిక్కింది. అంతర్వేది సముద్రతీరంలోకి చేపల వేటకు వెళ్లగా ఇది దొరికిందని, అతి కష్టం మీద హార్బర్ కు తీసుకొచ్చామని కాకినాడ మత్స్యకారులు తెలిపారు. అక్కడి నుంచి జేసీబీ సాయంతో వ్యాన్ లోకి చేపను ఎక్కించారు. కుంబాభిషేకం మార్కెట్లో ఈ చేప సుమారు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ధర పలుకుతుందని మత్స్యకారులు చెప్పారు.

సంబంధిత పోస్ట్