సహాయ శిబిరాల్లో 10,042 మంది

63చూసినవారు
సహాయ శిబిరాల్లో 10,042 మంది
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఇప్పటి వరకు 358 మంది చనిపోయారు. ఇక సహాయ శిబిరాల్లో 10,042 మంది ఆశ్రయం పొందుతున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్ శనివారం తెలిపారు. తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడారు. వారి కోసం 93 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 67 మంది మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు. సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్