ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ నౌక బోల్తా పడింది. అందులో పని చేస్తున్న 13 మంది భారతీయులు, మరో ముగ్గురు శ్రీలంక వాసులు ఉన్నట్లు ఒమన్ సముద్ర భద్రతా కేంద్రం మంగళవారం రాత్రి తెలిపింది. వారిని కనుగొనడానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. 'ప్రెస్టీజ్ ఫాల్కన్' అనే ఆ ఆయిల్ ట్యాంకర్ నౌక సముద్రంలో తలకిందులుగా మునిగినట్లు గుర్తించామంది. చమురు లీక్ అవుతుందా అనే విషయాన్ని ఒమన్ అధికారులు ధృవీకరించలేదు.