EPFOలో ఈ ఏడాది మార్చిలో నికరంగా 14.41 లక్షల మంది సభ్యులు చేరారు. తాజా ఉద్యోగ గణాంకాల ప్రకారం సుమారు 11.80 లక్షల మంది సభ్యులు EPFOను వీడినా, తర్వాత వీరిలో అత్యధికులు మళ్లీ చేరారని కార్మిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. కొత్తగా చేరిన 7.47 లక్షల మంది సభ్యుల్లో 18-25 ఏళ్లలోపు వారే 56.83% మంది ఉన్నారు. వీరంతా తొలిసారిగా ఉద్యోగాలు సాధించినవారే.