బంగ్లాదేశ్‌లో ఘర్షణల నేపథ్యంలో అక్కడి ప్రజలు సరిహద్దులు దాటుతున్నారు. భారత్‌లో అక్రమంగా చొరబడుతున్నారు. ఇలా భారత్‌లో ప్రవేశించిన 18 మంది బంగ్లాదేశీయులను భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. త్రిపురలోని గోమతి జిల్లాలో బంగ్లాదేశీయులు ఉన్నారనే సమాచారం అందింది. దీంతో పలు చోట్ల పోలీసు బలగాలు, భద్రతా దళాలు సోదాలు నిర్వహించాయి. 18 మంది బంగ్లా దేశీయులతో పాటు వారికి సహకరించిన ఐదుగురు భారతీయులను అరెస్ట్ చేశారు.