భారీ వర్షాలకు ఒమన్​లో 18 మంది మృతి

2923చూసినవారు
దుబాయ్ పొరుగున ఉన్న ఒమన్‌లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి నుంచి బుధవారం మధ్య ఒక్క ఒమన్​లోనే 230 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయిందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్​మెంట్ అధికారులు తెలిపారు. రెండేళ్లల్లో పడాల్సిన వర్షం ఈ మూడ్రోజుల్లోనే కురిసిందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్