సార్వత్రిక ఎన్నికలకు
నోటిఫికేషన్ ఇవాళ విడుదలైంది. 4వ విడత పోలింగ్ కోసం EC
నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ల స్వీకరణ ఉంటుంది. 4వ విడతలో రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ
ఎన్నికలు జరగనున్నాయి. మే 13న పోలింగ్.. జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తారు.