కేరళలోని త్రిసూర్‌లో బుధవారం భారీ చోరీ చోటుచేసుకున్నది. అరుణ్ సన్నీ అనే వ్యాపారి రోజీ థామస్ అనే వ్యక్తితో కలిసి 2.5 కిలోల బంగారు ఆభరణాలను తీసుకుని కారులో కోయంబత్తూరు నుంచి త్రిసూర్‌కు బయలుదేరారు. కుతిరన్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు మూడు కార్లలో అరుణ్ వాహనాన్ని వెంబడించి, కారులోని బంగారాన్ని లాక్కున్నారు. కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.