మొబైల్‌ ఫోన్ తయారీ రంగంలో 2.50 లక్షల ఉద్యోగాలు..!

560చూసినవారు
మొబైల్‌ ఫోన్ తయారీ రంగంలో 2.50 లక్షల ఉద్యోగాలు..!
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమ భారీ ఉపాధిని సృష్టిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రానున్న 12-16 నెలల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.50 లక్షల నుంచి 2.50 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఆపిల్ సంస్థ ఎగుమతి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని భారత్ లో తన మూడు కాంట్రాక్ట్ తయారీ కంపెనీలైన ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్‌లను పెద్ద ఎత్తున నియమించుకోబోతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్