స్పామ్ కాల్స్ నివారణలో భాగంగా 2.75 లక్షల ఫోన్ నంబర్లు బ్లాక్: TRAI

77చూసినవారు
స్పామ్ కాల్స్ నివారణలో భాగంగా 2.75 లక్షల ఫోన్ నంబర్లు బ్లాక్: TRAI
అవాంఛిత ఫోన్‌ కాల్స్, అన్‌ రిజిస్టర్డ్‌ టెలీ మార్కెటర్లపై టెలికాం సంస్థలు చర్యలు చేపట్టాయి. స్పామ్ కాల్స్ నివారణలో భాగంగా 2.75 లక్షల మొబైల్‌ నంబర్లను టెలికాం కంపెనీలు బ్లాక్‌ చేశాయని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. మరో 50కి పైగా సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు వెల్లడించింది. 2024 ప్రథమార్థంలోనే స్పామ్ కాల్స్ పై 7.9 లక్షల ఫిర్యాదులు అందాయని, వీటి అణచివేతకు ఇటీవల అనేక కఠిన ఆదేశాలిచ్చామని ట్రాయ్ తెలిపింది.

సంబంధిత పోస్ట్