ఆరు నెలల్లో 21 మంది మృతి

554చూసినవారు
ఆరు నెలల్లో 21 మంది మృతి
స్థానికంగా ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో.. తెలంగాణ యువకులు గల్ఫ్ దేశాల బాట పట్టి మోసపోతున్నారు. గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయి.. గడిచిన ఆరు నెలల్లో 21 మంది కామారెడ్డి వాసులు మృతిచెందారు. ఉద్యోగాల పేరితో ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు వసూలు చేసి గల్ఫ్ దేశానికి పంపి ఏజెంట్లు మోసం చేస్తున్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాల్లేక.. వ్యవసాయం గిట్టుబాటు కాక.. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి సుమారు 3 లక్షల మంది గల్ఫ్ దేశాల బాట పట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్