22 మంది అనుమానిత ఉగ్రవాదులను పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సుకు చెందిన పోలీసులు అరెస్టు చేశారు. కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ ప్రతినిధి దీనిపై మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ శాఖ ఇచ్చిన సమాచారం ఆధారంగా పంజాబ్‌లోని వేర్వేరు జిల్లాల్లో సుమారు 152 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించామని, ఐఎస్ఐఎస్, తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, లష్కరే ఈ జాంగ్వీ గ్రూపులకు చెందిన అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు తెలిపారు.