H-1B వీసాలకు సంబంధించిన కొత్త నిబంధనలను వెల్లడించడానికి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ సన్నద్ధమవుతోంది. ప్రతిపాదిత నిబంధనలు జూలై 8న విడుదల కానున్నాయి. అయితే H-1B వీసాలు తీసుకునేవారిలో భారతీయులే అధిక సంఖ్యలో ఉంటున్నారు. ఈ మార్పులు అనేక మంది భారతీయ H-1B వీసా హోల్డర్లతోపాటు కొత్తగా దరఖాస్తు చేసేవారికి భారంగా మారనున్నట్లు తెలుస్తోంది.