భారీ వర్షాలకు 23 మంది మృతి (వీడియో)

1068చూసినవారు
బ్రెజిల్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆ దేశంలోని రియో డి జనీరో, ఎస్పిరిటో శాంటోల రాష్ట్రాల్లో కార్లు, ఇతర వాహనాలు వరదలకు కొట్టుకుపోయాయి. ఇక భారీ వర్షాలకు ఇప్పటి వరకు 23 మంది చనిపోయినట్లు అక్కడి అధికారులు సోమవారం ప్రకటించారు. 5,200ల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. వర్షాలు తాత్కాలికంగా తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్