ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాల్లియా పట్టణంలో మంగళవారం అర్థరాత్రి బీహార్‌కు చెందిన స్పెషల్ ఆర్ముడ్ పోలీసులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 29 మంది పోలీసులకు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న బాల్లియా పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకొని.. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.