'నీ జతగా నేనుండాలి' సాంగ్ లిరిక్స్

2749చూసినవారు
'నీ జతగా నేనుండాలి' సాంగ్ లిరిక్స్
నీ జతగా నేనుండాలి
నీ యెదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
నాకే తెలియని నను చూపించి
నీకై పుట్టాననిపించి
నీ దాకా నను రప్పించావే
నీ సంతోషం నాకందించి
నా పేరుకి అర్ధం మార్చి
నేనంటే నువ్వనిపించావే
నీ జతగా నేనుండాలి
నీ యెదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి

కాళ్లోకొస్తావనుకున్నా
తెల్లార్లు చూస్తూ కూర్చున్న
రాలేదే జాడైన లేదే
రెప్పలా బయటే నేనున్నా
అవి మూస్తే వద్దామనుకున్నా
పాడుకోవేం పైగా తిడతావేం
లోకంలో లేనట్టి మైకంలో నేనుంటే
వదిలేస్తావా నన్నిలా
నీ లోకం నాకంటే ఇంకేదో
ఉందంటే నమ్మే మాటలా
నీ జతగా నేనుండాలి
నీ యెదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి

తెలిసి తెలియక వాలింది
నీ నడుంఒంపుల్లో నలిగింది నా చూపు
ఎం చేస్తాం చెప్పు
తోచని తొందర పుడుతుంది
తెగ తుంటరిగా నను నెడుతుంది
నీ వైపు నీదే ఆ తప్పు
నువ్వంటే నువ్వంటూ ఏవేవో
అనుకుంటూ విడిగా ఉండలేముగా
దూరంగా పొమ్మంటూ దూరాన్ని
తరిమేస్తూ ఒకటవ్వాలిగా
నీ జతగా నేనుండాలి
నీ యెదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి

సినిమా: ఎవడు
మ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్
సింగర్: కార్తీక్, శ్రేయా ఘోషల్
లిరిక్స్: సిరివెన్నెల సీతారామయ్య శాస్త్రి

సంబంధిత పోస్ట్