తదుపరి మహమ్మారిపై నిపుణుల హెచ్చరిక.. ప్రపంచం సిద్ధంగా లేదని వ్యాఖ్యలు

2676చూసినవారు
తదుపరి మహమ్మారిపై నిపుణుల హెచ్చరిక.. ప్రపంచం సిద్ధంగా లేదని వ్యాఖ్యలు
అన్ని దేశాలు తదుపరి మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేవని రెడ్‌క్రాస్ హెచ్చరించింది. భవిష్యత్తులో ఆరోగ్య సంక్షోభాలు, వాతావరణ సంబంధిత విపత్తులు ఒకేసారి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్నా బలమైన సంసిద్ధత వ్యవస్థలు ఏర్పాటు చేయలేకపోయారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ & రెడ్ క్రెసెంట్ సొసైటీస్ (IFRC) తెలిపింది.

దేశాలు ఒకటి మాత్రమే కాకుండా బహుళ ప్రమాదాల కోసం సిద్ధంగా ఉండాలని ఐఎఫ్ఆర్సీ పేర్కొంది. వివిధ రకాల విపత్తుల కోసం ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచుకోవాలని, ఎందుకంటే అవి ఏకకాలంలో సంభవించవచ్చని ఐఎఫ్ఆర్సీ హెచ్చరించింది. దేశాలు 2019లో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఉన్నంత సిద్ధంగా ఇప్పుడు లేవని చెప్పింది.

వైరస్‌ ను అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ మూడవ వార్షికోత్సవం సందర్భంగా కోవిడ్-19 స్థాయిలో భవిష్యత్తులో సంభవించే విషాదాలను తగ్గించడంపై సిఫార్సులు చేస్తూ ఐఎఫ్ఆర్సీ 2 నివేదికలను జారీ చేసింది. భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సంక్షోభానికి ఇప్పుడే సిద్ధం కావడానికి కరోనా మహమ్మారి మేల్కొలుపు కాల్ అని IFRC సెక్రటరీ జనరల్ జగన్ చాపాగైన్ అన్నారు.

ప్రజలు భద్రతా ఏర్పాట్లను విశ్వసిస్తే వారు ప్రజారోగ్య చర్యలను పాటించడానికి, టీకాను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారని ఐఎఫ్ఆర్సీ తెలిపింది. పేలవమైన పారిశుధ్యం, రద్దీ, పోషకాహారలోపం వ్యాధులు వృద్ధి చెందడానికి కారణమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 2025 నాటికి దేశాలు దేశీయ ఆరోగ్య ఫైనాన్స్‌ ను స్థూల దేశీయోత్పత్తిలో ఒక శాతం పెంచాలని, గ్లోబల్ హెల్త్ ఫైనాన్స్‌ ను సంవత్సరానికి కనీసం $15 బిలియన్లు పెంచాలని పేర్కొంది.