'తిలోత్తమా' సాంగ్ లిరిక్స్

3616చూసినవారు
'తిలోత్తమా' సాంగ్ లిరిక్స్
తిలోత్తమ ప్రియా వయ్యారమా
ప్రభాతమ శుభ వసంతమా
నే మోయలేనంటూ హృదయాన్ని అందించా
నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేసా
ఏ దారిలో సాగుతున్న
ఎద నీవైపుకే లాగుతోంది
ఏ వేళలో ఎప్పుడైనా మది
నీ ఊహలో ఊగుతోంది

ఆఅ తిలోత్తమ ప్రియా వయ్యారమా
ఆఅ ఆఆ అఅఅఅఅఅ ఆఆఆ

పెదవే ఓ మధుర కవిత చదివే
అడుగే నా గడప నొదిలి కదిలే
ఇన్నాళ్లు లేని ఈ కొత్త బాణీ
ఇవ్వాలె మనకెవరు నేర్పరమ్మా
ఈ మాయ చేసింది ప్రేమే
ప్రియా ప్రేమంటే ఒకటైన మనమే
తిలోత్తమ శుభ వసంతమా

కలలే నా ఎదుట నిలిచే నిజమై
వలపే నా వొడికి దొరికే వరమై
ఏ రాహువైన ఆషాఢమైన
ఈ బాహు బంధాన్ని విడదీయునా
నీ మాటలే వేదమంత్రం
చెలి నువ్వన్నదే నా ప్రపంచం

తిలోత్తమ ప్రియా వయ్యారమా
ప్రభాతమ శుభ వసంతమా

నే మోయలేనంటూ హృదయాన్ని అందించా
నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేసా
ఏ దారిలో సాగుతున్న ఎద
నీవైపుకే లాగుతోంది
ఏ వేళలో ఎప్పుడైనా మది
నీ ఊహలో ఊగుతోంది

సినిమా: మాస్టర్
మ్యూజిక్: దేవా
సింగర్: సుజాత, హరిహరణ్
లిరిక్స్: చంద్రబోస్

సంబంధిత పోస్ట్