తెలంగాణలో 40 వేల మంది డ్రగ్స్‌ బాధితులు: టీన్యాబ్‌

60చూసినవారు
తెలంగాణలో 40 వేల మంది డ్రగ్స్‌ బాధితులు: టీన్యాబ్‌
తెలంగాణ రాష్ట్రంలో 40వేల మందికిపైగా డ్రగ్స్‌ వినియోగదారులు ఉన్నారు. అందులో గత 7 నెలల కాలంలోనే సుమారు 6వేల మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో(టీజీన్యాబ్‌) మత్తుపదార్థాల సరఫరాదారులు, విక్రేతలతోపాటు వాటికి అలవాటుపడి భవిష్యత్తును పాడుచేసుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులను గుర్తించేందుకూ రంగంలోకి దిగింది. పెడ్లర్ల నుంచి సేకరించిన సమాచారంతోపాటు ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తూ ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 40 వేల మందికిపైగా గుర్తించింది.

సంబంధిత పోస్ట్