జూన్‌లో కొత్తగా 42లక్షల డీమ్యాట్ అకౌంట్లు

82చూసినవారు
జూన్‌లో కొత్తగా 42లక్షల డీమ్యాట్ అకౌంట్లు
గత నెలలో రికార్డ్ స్థాయిలో కొత్తగా 42.4లక్షల డీమ్యాట్ అకౌంట్లు నమోదయ్యాయి. ఓ నెలలో నలభై లక్షలకుపైగా అకౌంట్లు క్రియేట్ అవడం ఇది నాలుగోసారి. గతంలో 2023 డిసెంబరు సహా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆ స్థాయిలో అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. ఇక మొత్తంగా డీమ్యాట్ ఖాతాల సంఖ్య 16.2కోట్లకు చేరింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మార్కెట్లు రాణిస్తుండటంతో మదుపర్లలో ఆసక్తి పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్