త్రిపురలోని గండ త్విసాలో జరిగిన విషాద సంఘటన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం స్పందించింది. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రగాయాలైన వారికి రూ.2 లక్షలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వల్ప గాయాలైన వ్యక్తులకు రూ.1 లక్ష ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బాధితులను, వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేసింది.