TS: మహబూబాబాద్ జిల్లాలో పులి కోసం వేట కొనసాగుతోంది. కొత్తగుడ మండలంలోని కోనాపూరం అటవీ ప్రాంతం లో పులి సంచరిస్తుందని వారం రోజుల నుంచి గిరిజన గ్రామాలు భయాందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో 5 బృందాలు కొత్తగూడ , గంగారం అడవుల్లో పులి ఆచూకీ కోసం గాలిస్తోన్నాయి. వారం రోజుల వరకు పొలాల దగ్గరకు వెళ్లొద్దని గిరిజనులకు సూచించారు.