ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘోరంగా ఓడిపోయింది. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా రెండింటిల్లోనూ రోహిత్ శర్మ విఫలమయ్యారు. ఈ క్రమంలో అతని రిటైర్మెంట్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఫామ్ లేమితో తంటాలు పడుతున్న రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో చివరి మ్యాచ్ తర్వాత వీడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది.