ఉపాధ్యాయ పోస్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్

72చూసినవారు
ఉపాధ్యాయ పోస్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్
రాజస్థాన్ ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ మేరకు చట్ట సవరణకు సీఎం భజన్ లాల్ శర్మ ఆమోదం తెలిపారు. మహిళలకు కొత్త అవకాశాలు, ఉపాధి కల్పనకు ఈ నిర్ణయం దోహదపడుతుందని సీఎం అన్నారు. ఇప్పటివరకు ఈ రిజర్వేషన్లు 30 శాతంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 27 వేల థర్డ్ గ్రేడ్ టీచర్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్