వేసవిలో లభించే ఈ పచ్చి మామిడిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పచ్చి మామిడిలో కెరోటినాయిడ్స్ అధికంగా ఉండటం వల్ల కంటిచూపు మెరుగుపడేలా సహాయపడుతుంది. వేసవిలో పచ్చి మామిడిని తినడం వల్ల డీహైడ్రేషన్‌కు గురికాకుడా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు. పచ్చిమామిడి అజీర్తి సమస్యల్ని తగ్గిస్తుంది. పచ్చిమామిడిలో విటమిన్ ఇ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.