ఫ్రాన్స్‌కు చెందిన గృహోపకరణాల తయారీ సంస్థ 'థామ్సన్' పండుగ ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్ టీవీలు, వాషింగ్‌మెషిన్లు, స్పీకర్లను తగ్గింపు ధరకే అందిస్తున్నట్లు ప్రకటించింది. రూ.5,999 ప్రారంభ ధరకే స్మార్ట్ టీవీని అందిస్తున్న సంస్థ.. రూ.12,999 ప్రారంభ ధరతో వాషింగ్మెషీన్లను విక్రయిస్తున్నట్లు తెలిపింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ప్రత్యేకంగా బిగ్ బిలియన్ డేస్‌లను దృష్టిలో పెట్టుకొని ప్రకటించిన ఈ ఆఫర్లు వచ్చే పది రోజుల వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.