ఇనుప కవచంలోనే 72 ఏళ్లు.. ‘పోలియో పాల్’ కన్నుమూత

1069చూసినవారు
ఇనుప కవచంలోనే 72 ఏళ్లు.. ‘పోలియో పాల్’ కన్నుమూత
అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలియాస్ పోలియో పాల్ కన్నుమూశారు. ఇనుప ఊపిరితిత్తుల లోపల దాదాపు 70 సంవత్సరాలు గడిపిన ఆయన, 78 సంవత్సరాల వయస్సులో మరణించారు. పాల్ మృతిని ఆయన సంరక్షణ బాధ్యతలు చూసుకొనే ఒక ఎన్జీఓ సంస్థ ధృవీకరించింది. పాల్ అలెగ్జాండర్ 2024 మార్చి 11న, సోమవారం మరణించాడని మంగళవారం GoFundMe పేజీలో నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. "పాల్ అలెగ్జాండర్- ది మ్యాన్ ఇన్ ది ఐరన్ లంగ్ ఇక లేరు" అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్