సికింద్రాబాద్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ 723 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ట్రేడ్స్ మెన్/ఫైర్ మెన్ పోస్టులకు అభ్యర్థులు వెబ్‌సైట్ https:// www.aocrecruitment.gov.in/ ద్వారా ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 22 దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లమో, బీటెక్ చదివిన వారు అర్హులు. జీతం నెలకు రూ.29 వేల నుంచి రూ.92 వేలు.