కొల్లేరు వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ

58చూసినవారు
కొల్లేరు వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ
కొల్లేరు సరస్సు సరిహద్దుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గత ఏడాది డిసెంబర్‌లో విచారణ తరువాత చేపట్టిన కార్యాచరణను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 5 వేల ఎకరాల్లో ఆక్రమణలు తొలగించినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌ని పరిశీలించిన సుప్రీంకోర్టు.. తదుపరి నివేదిక దాఖలు చేయాలని ఆదేశించి, విచారణను మార్చి 19కి వాయిదా వేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్