రీవెరిఫికేషన్‌లో విఫలమైన 73 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికాం కంపెనీలు రద్దు చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ LSలో వెల్లడించారు. ఆయా మొబైల్ కనెక్షన్లను రీవెరిఫై చేయాలని టెలికం విభాగం (డాట్) టెల్కోలను ఆదేశించింది. వివరాల ధ్రువీకరణలో విఫలమైన కంపెనీలు, నకిలీ ఐడీలు లేదా అడ్రస్‌లతో తప్పుడు కనెక్షన్లు పొందిన వారిని గుర్తించేందుకు డాట్ ఒక వ్యవస్థను రూపొందించింది.