హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు జరిగి నేటికి (ఆగష్టు 6, 2024) 79 ఏళ్లు. ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసిన తీరని విషాదం. జపాన్‌లో 1945 ఆగస్ట్‌లో జరిగిన అణుబాంబు పేలుళ్లతో హిరోషిమాలో లక్షా 40వేల మంది, నాగసాకిలో 74వేల మందిని బలి తీసుకున్న ఉదంతం. ప్రపంచంలోనే తొలి అణుబాంబు దాడిగా పేరొందిన ఈ దాడుల ధాటికి విలవిల్లాడిన జపాన్ శత్రు దేశాలకు లొంగిపోవడంతో 1945 ఆగస్ట్ 14న రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది.