TG: SLBC టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది మృతదేహాలను రెస్క్యూ టీం గుర్తించిందని వస్తున్న వార్తలపై నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని సూచించారు. టన్నెల్ లో గల్లంతైన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. తమకు ఏదైనా సమాచారం అందితే వెంటనే అప్డేట్ చేస్థామని కలెక్టర్ వెల్లడించారు.