ఏలూరు జిల్లాలోని నూజివీడులో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఒకేసారి 800 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరారు. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గడిచిన మూడ్రోజుల్లో సుమారు 800 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారమే కారణమని యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు.