ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో 800 మంది
విద్యార్థులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకారంలో కూర్చుని, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పురుషోత్తం అనే కళాకారుడు స్థానిక నోబెల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నిమిషాల వ్యవధిలోనే
విద్యార్థులు పవన్ చిత్రపటం ఆకారంలో కూర్చున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.