ఏపీలోని కర్నూలు జిల్లా హోళగుంద మండల పరిధిలోని నెరణికి, నెరణికితండా, కొత్తపేట కొండ గుహలో వెలసిన దేవరగట్టు మల్లేశ్వరుని జైత్రయాత్ర (కర్రల సమరం) శనివారం అర్ధరాత్రి జరిగింది. జైత్ర యాత్రలో రింగ్ కర్రలు, అగ్నిదివిటీల ఆవిరి తగిలి 95 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులన చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. 800 మంది పోలీసులు ఉన్నప్పటికీ రింగ్ కర్రలను దేవరగట్టుకు రాకుండా అడ్డుకోలేకపోయారు.