దేశంలో 96 కోట్ల మంది ఓటర్లు: ఈసీ

72చూసినవారు
దేశంలో 96 కోట్ల మంది ఓటర్లు: ఈసీ
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 96 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వచ్చే లోక్‌సభలో వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. వీరిలో 47 కోట్ల మంది మహిళలు ఉన్నారని స్పష్టం చేసింది. 18-19 ఏళ్ల వయసు ఉన్నవారు 1.73 కోట్ల మంది ఉన్నారని తాజా గణాంకాల్లో తెలిపింది. ఎన్నికల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 12 లక్షల పోలింగ్ కేంద్రాలు, 1.5 కోట్ల మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్