కోల్‌కతాలోకి 16 ఏళ్ల స్పిన్నర్

1578చూసినవారు
కోల్‌కతాలోకి 16 ఏళ్ల స్పిన్నర్
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఆటగాడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యారు. దీంతో అతడి స్థానాన్ని అఫ్గానిస్థాన్ యంగ్ స్పిన్నర్ అల్లాహ్ ఘజన్‌ఫర్‌తో కేకేఆర్ భర్తీ చేసింది. 16 ఏళ్ల ఘజన్‌ఫర్‌ను బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకే దక్కించుకుంది. మరోవైపు ప్రసిధ్ కృష్ణ స్థానంలో కేశవ మహరాజ్‌ను తీసుకున్నట్లు రాజస్థాన్ రాయల్స్ ప్రకటించింది. రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌కు తీసుకుంది.

సంబంధిత పోస్ట్