మ్యాన్ హోల్ లోకి దిగిన ఓ కార్మికుడు ఊపిరాడక చనిపోయాడు. విశాఖలోని పెందుర్తిలో ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో భాగంగా జాకీర్(25) అనే యువకుడు డ్రైనేజీ పనుల కోసం 10 అడుగుల లోతున్న మ్యాన్ హోల్ లోకి దిగాడు. ఈ క్రమంలో అతడికి ఆక్సిజన్ అందక సృహతప్పి పడిపోయాడు. బయటకు తీసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదని స్థానికులు తెలిపారు. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని బయటకు తీశారు. ఆసుపత్రికి తరలించగా జాకీర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.